Publish Date: Tue, 15 Dec 2015 (17:30 IST)
Updated Date: Tue, 15 Dec 2015 (17:32 IST)
చాలా మంది రోజులో ఎక్కువ సమయం తమతమ ఆఫీసుల్లోనే గడుపుతుంటారు. ఆఫీసులో ఎవరి పనివారిదే అయినా ఒకరి పనికి మరొకరి పనికి సంబంధం ఉంటుంది. తోటివారితో వారితో కలిసి పని చేయకపోతే ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఆఫీసులో అయినంతవరకు అందరితో స్నేహపూరితంగా మెలగాలి. సన్నిహితంగా ఉండనవసరం లేదు, కనిపించినప్పుడు ఒక చిరునవ్వుతో పలకరిస్తే చాలు.
అలాగే, ఆఫీసులో ఉన్నంతసేపు... మూడీగా ఉండకుండా, కలివిడిగా ఉండటం ఎంతో ఉత్తమం. అలాగే, ఆఫీసులో అందరి సమర్థత ఓకేలా ఉండదు. మీ కన్నా తక్కువ సమర్థతో పనిచేసేవారిని ఆటపట్టించడం, మీకన్నా ఎక్కువ పనిచేసేవారిని చూసి అసూయపడటం మంచిది కాదు. అందువల్ల సహనంతో పాటు.. మెళకువలు అలవర్చుకుని ముందుకు సాగినపుడే మీరు చేసే వృత్తిలో రాణించలగరు.