Publish Date: Tue, 16 Dec 2014 (17:03 IST)
Updated Date: Tue, 16 Dec 2014 (17:04 IST)
భార్యాభర్తల మధ్య గొడవా? అయితే తప్పంతా నీదే అనే మాట అనకండి ప్లీజ్ అంటున్నారు మానసిక నిపుణులు. 'తప్పంతా నీదే' ఎదుటివారిని తప్పంతా నీదేనని నిందించడం వల్ల లాభం లేదు. తప్పంతా నీదేనని గొడవలో ఒకరిని ఒకరు నిందించుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు.
ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుని పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నించాలి. 'తప్పంతా నీదే'నని వాదించుకుంటూ ఉంటే సమస్యని పరిష్కరించే దిశగా ఆలోచించడం మానేసి ఒకరిని ఒకరు నిందించుకునేందుకే ఆలోచనలు మళ్ళుతాయి.
సమస్యను పరిష్కరించేందుకు అవసరమైనవాటిపై దృష్టిపెట్టండి. మిమ్మల్ని ఎదుటి మనిషి ప్రవర్తన ఏ విధంగా గాయపరిచిందో వివరించండి. "నువ్వు నేను చెప్పేది వినట్లేదని అనుకున్నాను అయినా నీకు నేను చెప్పి ఉండవలసింది" అంటూ ఆ పరిస్థితిలో ఇద్దరి ప్రమేయం వివరించండని మానసిక నిపుణులు అంటున్నారు.