Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ తెలివి తక్కువ అమ్మాయికి చదువు చెబితే... మరో తెలివి తక్కువ అబ్బాయిని ప్రేమిస్తోంది... ఏం చేయాలి?

Advertiesment
life style and relations
, మంగళవారం, 6 అక్టోబరు 2015 (17:10 IST)
నేను క్లాసులో టాపర్‌ని. ఏ సబ్జెక్టులో అయినా ఫస్ట్ ర్యాంక్ నాదే. కళాశాలలో మా ఉపాధ్యాయులు నన్ను ఎంతో మెచ్చుకుంటారు. ఓ రోజు మా క్లాసులో ఓ అమ్మాయిని మా టీచర్ మార్కులు సరిగా రాలేదని తిడుతున్నారు. అంతా అయిపోయాక ఆమె అలా పక్కనే కూర్చుని బాధపడుతోంది. చాలా అందంగా ఉంటుంది. ఆమె బాధను చూసి అటుగా వెళ్లాను. నన్ను చూస్తూ నవ్వింది. ఏంటి ప్రాబ్లమ్ అంటే ఏమీ లేదని అంది. నేను నీకు చెప్తాలే అని అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రత్యేకంగా టీచ్ చేశాను. నెక్ట్స్ ఎగ్జామ్స్‌లో ఆమెకు మంచి మార్కులు వచ్చాయి. 
 
ఐతే చిత్రంగా ఆమె మొన్నీమధ్య మా క్లాసులో అత్యంత తెలివి తక్కువ అబ్బాయితో ఆమె కనబడింది. అతడికి గంటల తరబడి పాఠాలు చెపుతోంది. నేను వెళితే హాయ్ అని విష్ చేస్తుంది కానీ పట్టించుకోవడం లేదు. ఆమె ప్రవర్తన నాకు నచ్చక వచ్చేశాను. కానీ ఆమెను చూడనిదే ఉండలేకపోతున్నాను. బహుశా ఆమెను నేను ప్రేమిస్తున్నానేమో...? కానీ ఆమె అతడితోనే గడుపుతోంది. ఆమె నాతో కాకుండా అతడితో అలా ఉంటుందంటే... ఆమె అతడినేమైనా ప్రేమిస్తుందేమోనని డౌటుగా ఉంది. ఆమెకు నా ప్రేమ చెబితే ఏమంటుందో ఏమో...? ఏం చేయమంటారు...?
 
మీ వ్యవహారం చూస్తుంటే చదువును గాలికి వదిలేసినట్లున్నారు. చదువు రాని ఆమెకు చదువు చెప్పి మార్పు తెచ్చిన మీరు ఆమె మరొకరికి అదే చదువు చెప్తుంటే ఎందుకు ఫీలవుతున్నారు. మరొకరికి చదువు చెప్పినంత మాత్రాన ప్రేమలో పడినట్లు అనుకోవద్దు. అలాగే మీరు చదువు చెప్పినంత మాత్రాన ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుందని అనుకోవద్దు. కాబట్టి ఆమెతో మీ విషయం చెప్పి, ఆమె అంగీకరిస్తే చదువు ముగిశాక, ఉద్యోగం సాధించాక పెళ్లి చేసుకోండి. అప్పటివరకూ ఎవరికివారు కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోండి.

Share this Story:

Follow Webdunia telugu