Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేపు లభించే హంస కన్నా నేడు లభించిన బాతు బెటర్‌ కదా... ''కామాతురాణం...''

కామేచ్ఛను పశుపక్ష్యాదుల విషయంలో ప్రకృతి పరిమితం చేసింది. వాటికి కామ సూత్రాలతో పనిలేదు. ప్రత్యేక రుతువులలో మాత్రమే అవి రమిస్తాయి. మిగతా సమయమంతా తిండి కోసము, ఉండడం కోసమూ వాటి తిప్పలన్నీనూ. మనిషి ఎన్ని తిప్పలు పడుతున్నా కామం అతనిని వెన్నంటే ఉంటుంది. ఎప్

Advertiesment
life style
, బుధవారం, 15 జూన్ 2016 (13:00 IST)
కామేచ్ఛను పశుపక్ష్యాదుల విషయంలో ప్రకృతి పరిమితం చేసింది. వాటికి కామ సూత్రాలతో పనిలేదు. ప్రత్యేక రుతువులలో మాత్రమే అవి రమిస్తాయి. మిగతా సమయమంతా తిండి కోసము, ఉండడం కోసమూ వాటి తిప్పలన్నీనూ. మనిషి ఎన్ని తిప్పలు పడుతున్నా కామం అతనిని వెన్నంటే ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు సమయం సందర్భాలకు అతీతంగా సంభోగం కోసం మనిషి మనసు పరితపిస్తుంటుంది. మంచిచెడు, నీతి అవినీతి పట్టవు. పశువులు, పక్షుల కామేచ్ఛ బుద్ధిపూర్వకమైనది కాదు. మనిషి కామం అతడి ప్రకోపానిది. అందుకే ఇన్ని అత్యాచారాలు, అక్రమ సంబంధాలు.
 
అందువల్లనే కామశాస్త్రం మనకు అవసరమైంది. కామశాస్త్రం అంటే స్త్రీ పురుషులు ఒకర్నొకరు ఎలా సంతృప్తిపరచాలి అన్న ఒక్క విషయమే ఉండదు. నీతి నియమాలు ఉంటాయి. మనిషి మనసును అదుపులో ఉంచే ధర్మ బోధనలు ఉంటాయి. ఆరోగ్యం కాపాడుకుంటూ ఒక క్రమపద్ధతిలో, శాస్త్ర విజ్ఞానం చూసే దారిలో కామసుఖాన్ని అనుభవించేందుకు కామసూత్రాలు అవసరమవుతాయి.
 
ఇక్కడ ఓ సందేహం రావచ్చు. అసలు ఏమిటిదంతా? శాస్త్రయుక్తంగా కార్యం చేస్తే అదేదో అయిందన్న నానుడి ఉంది కదా. దొరికిన దాన్ని దొరికినట్లు అనుభవించకుండా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే మనకు దక్కాల్సిన సౌఖ్యాలను వేరొకరు దోచుకెళ్ళరని గ్యారంటీ ఏమిటి? రేపు లభించే హంస కన్నా నేడు లభించిన బాతు బెటర్‌ కదా. ధర్మాన్ని ఆక్షేపించేవారి వాదన కూడా సరిగ్గా ఇలానే ఉంటుంది. 
 
వెనకటికి ఒక వ్యక్తి యాచన కోసం ఓ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు. ఆ పెద్ద మనిషి దగ్గర సమయానికి తాను ఇవ్వాలనుకున్నంత డబ్బు లేదు. కొద్దిగా మాత్రమే ఉంది. “తీసుకుంటే ఇది తీసుకో, లేకుంటే రేపురా పెద్ద మొత్తంలో ఇస్తాను” అని చెప్పాడు.
 
యాచకుడు సంశయించాడు. రేపటికి రాజెవరో పేద ఎవరో. ఈ రోజుకి దొరికిందిదే ప్రాప్తమని సరి పెట్టుకుంటాను అనుకుని అప్పటికి ఆ పెద్ద మనిషి ఇచ్చినదానితోనే సరిపెట్టుకుని వెళ్ళిపోయాడు. అయితే వాత్స్యాయనుడు ఈ వాదాన్ని ఖండిస్తున్నాడు. ధర్మం ముమ్మాటికీ అవసరమే అని ఆయన వాదం, నిజమే.
 
అయినా శాస్త్రాన్ని శంకించరాదనేది వాదన. చేతబడులు, ప్రయోగాలు మొదలైన అధికార కర్మలున్నాయి. అవి హింసాత్మకాలు. శాంతి, పౌష్టిక మొదలైన శుభప్రదాలైన కర్మలున్నాయి. ఇవి శుభం చేకూరుస్తాయి. ఈ కర్మలకు వాటి వాటి ఫలితాలు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటాయని మనలో చాలామంది నేటికీ నమ్ముతూనే ఉన్నాం. ధర్మం మాటకొస్తే సూర్యచంద్రులు, గ్రహనక్షత్ర తారకలూ... ఈ ఖగోళం యావత్తూ క్రమం తప్పకుండా ప్రకాశిస్తూనే ఉంది. ఇది లోకకల్యాణార్థం జరిగిన ఏర్పాటులా తోస్తుంది. ఎప్పుడో వచ్చే పంటకోసం, మన చేతుల్లో ఉన్న విత్తనాలను ముందే విత్తుతున్నాం. 
 
కాబట్టి రానున్న ఫలితాల కోసం ఇప్పుడే ధర్మాన్ని ఆచరించడం మన విధి అని వాత్స్యాయనుడు అంటాడు. విషయ పరిజ్ఞానం సముపార్జించాలనుకున్న వారికి తొందర పనికిరాదు. డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వెళితే అంతా రసవిహీనమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వేదిక ఏర్పాట్లు