Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శృంగారంలో భర్తను భార్య డామినేట్ చేస్తే భరించలేడా?

శృంగారంలో భర్తతో పాటు భార్య కూడా సమానంగా యాక్టివ్‌ పార్ట్‌ తీసుకొన్నప్పుడే దాంపత్య సుఖాన్ని ఆమె యధేచ్చగా అనుభవించగలుగుతుంది. కానీ ఆది నుంచి సమాజంలో స్త్రీ స్థానం ద్వితీయంగానే ఉంటున్న విషయం తెల్సిందే. శృంగారంలో సైతం అదే అణచివేత ధోరణి కొనసాగుతోంది. దీం

శృంగారంలో భర్తను భార్య డామినేట్ చేస్తే భరించలేడా?
, శుక్రవారం, 10 మార్చి 2017 (19:36 IST)
శృంగారంలో భర్తతో పాటు భార్య కూడా సమానంగా యాక్టివ్‌ పార్ట్‌ తీసుకొన్నప్పుడే దాంపత్య సుఖాన్ని ఆమె యధేచ్చగా అనుభవించగలుగుతుంది. కానీ ఆది నుంచి సమాజంలో స్త్రీ స్థానం ద్వితీయంగానే ఉంటున్న విషయం తెల్సిందే. శృంగారంలో సైతం అదే అణచివేత ధోరణి కొనసాగుతోంది. దీంతో స్త్రీ పురుషునికి సుఖాన్నందించే వస్తువు మాత్రమే అనే భావన చాలా మందిలో ఉంది. ఇది స్త్రీలలోనూ ఉంది. 
 
ఫలితంగా శృంగారమనేది పురుషుడు మాత్రమే ప్రారంభించవలసిన కార్యమని, తమంత తాముగా ఉత్సాహంగా పాల్గొనాల్సిన అవసరం లేదని పలువురు స్త్రీలు భావిస్తున్నారు. అన్ని రంగాలలోనూ పురుషునితో సమానంగా దూసుకుపోతున్న ఈ ఆధునిక కాలంలో సైతం చాలామంది స్త్రీలు ఆ రకమైన భావనల నుంచి బయట పడలేకపోతున్నారు. ఇలాంటి మహిళల్లో మాత్రం సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ భావప్రాప్తి అనేది కలగడంలేదు. 
 
ఒకవేళ శృంగారంలో భార్య సెక్సు విషయాల గురించి మాట్లాడినా, భర్తని డామినేట్‌ చేస్తూ ప్రవర్తించినా భర్త భరించలేడు. ఏకంగా ఆమె నైతిక ప్రవర్తనే అనుమానించే స్థితికి వచ్చేస్తాడు. దీంతో వారి దాంపత్య జీవితంలో విభేదాలు పొడచూపే అవకాశం లేకపోలేదు. ఐతే ఈ రకమైన ధోరణి మారాలి. భార్య యాక్టివ్ పార్ట్ తీసుకుని శృంగారంలో కొత్త పద్ధతులు చెప్పినప్పుడు వాటిని భర్త కూడా అనుసరించాలి. అంతేకానీ, భార్య ఎప్పుడూ శృంగారంలో తను చెప్పిన పద్ధతి ప్రకారమే నడుచుకోవాలని అనుకోవడం మాని ఆమెకు కూడా ప్రాధాన్యత ఇస్తే శృంగారంలో సుఖానుభూతులు పొందగలరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్తిమీరి ఆకు రసం, కషాయంతో ఆరోగ్యం