Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భార్యను రహస్య ప్రేమికుడితో అలా చూశా... ఆత్మహత్యే దారిలా కనబడుతోంది...

ఇటీవలే మా పెళ్లయింది. పెళ్లయిన తర్వాత హనీమూన్ వెళ్లాం. అక్కడ నాతో ఎంతో సంతోషంగా గడిపింది. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఒకరోజు హడావుడిగా సెల్ ఫోను తీసుకుని చాటింగ్ చేస్తూ ఉంది. నేను ఆఫీసు నుంచి వచ్చానన్న స్పృహ కూడా లేకుండా అలానే చేస్తూ ఉంది. కొద్దిసేపటి తర్

Advertiesment
life style
, గురువారం, 19 మే 2016 (17:12 IST)
ఇటీవలే మా పెళ్లయింది. పెళ్లయిన తర్వాత హనీమూన్ వెళ్లాం. అక్కడ నాతో ఎంతో సంతోషంగా గడిపింది. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఒకరోజు హడావుడిగా సెల్ ఫోను తీసుకుని చాటింగ్ చేస్తూ ఉంది. నేను ఆఫీసు నుంచి వచ్చానన్న స్పృహ కూడా లేకుండా అలానే చేస్తూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఫోన్ పక్కన పడేసి తల పట్టుకుని దిండులో ముఖం దాచుకుని పడుకుంది. నేను ఆమెను కదిలించలేదు. మరుసటి రోజు ఉదయం ఏదో డల్ గా ఉన్నావెందుకని ప్రశ్నించాను. ఏమీ లేదని అంది. ఐతే ఆమె వంటింట్లోకి వెళ్లాక అనుమానం వచ్చి ఆమె ఫోను తీసుకుని చూశాను. 
 
ఓ వ్యక్తితో రొమాంటిక్ సంభాషణ చేసినట్లు కనబడింది. దాంతో నా భార్యను ఓ విషయం అడిగాను. ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించావా అని. అదేం లేదని అందామె. అప్పటికి వదిలేసినా ఆమెను ఓ కంట గమనిస్తూనే ఉన్నాను. ఈమధ్య ఓసారి ఏదో పనిపై ఇంటికి వెళ్లేసరికి నా భార్యతో ఓ వ్యక్తి రొమాన్స్ చేస్తూ కనబడ్డాడు. అది చూసి నేను షాక్ తిన్నాను. బయటకు వెళ్లిపోయాను. రెండుమూడు గంటల తర్వాత వచ్చి... మళ్లీ ఈ విషయమై నిలదీశాను. ఆమె బావురుమంది. పెళ్లి కాక మునుపే తనకు ప్రియుడు ఉన్నట్లు చెప్పింది. పెద్దల ఒత్తిడి కారణంగా నన్ను చేసుకున్నానని చెప్పింది. 
 
పెళ్లికి ముందు అతడితో గడిపిన ఫోటోలను నాకు చూపిస్తానని భయపెట్టి తనను లొంగదీసుకున్నట్లు చెప్పింది. ఈ కారణంగా తామిద్దరం కలుసుకుంటున్నట్లు చెప్పింది. ఈ విషయం తెలిసి నేను పూర్తిగా కుంగిపోయాను. నా భార్య ముఖం చూస్తే అతడు-ఆమె కలిసి ఉన్న ఘట్టం కనిపిస్తోంది. నిజానికి నేనంటే ఆమెకు ప్రాణం. అతడి ఉచ్చులో పడి అలాంటి పొరబాటు చేసింది. అలా అని సర్దిచెప్పుకోలేకపోతున్నాను. ఆమెను నేను ఏమీ చేయలేను. అలాగని ఇది చూస్తూ భరించలేను. ఆత్మహత్య చేసుకోవాలని కొన్నిసార్లు అనిపిస్తోంది. పరిష్కారమేమిటో తెలియడంలేదు.
 
ఏ సమస్యకైనా పరిష్కారం ఆత్మహత్య కానేకాదు. ఆత్మహత్య అనేది పిరికి చర్య. ఇకపోతే మీరు ఎదుర్కొంటున్న సమస్య చాలా దారుణమైనదే. ఇలాంటి సమస్యలను ఎదుర్కొని నిలబడటం కాస్త కష్టమే. ఐతే సమస్య ఇద్దరికీ తెలిసింది కనుక కూర్చుని మాట్లాడుకోండి. ఖచ్చితంగా ఓ మార్గం దొరుకుతుంది. దానిని అనుసరించి ముందుకు వెళ్లండి. అంతేకానీ.... ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. సమస్య పరిష్కారం కాదని మీరు భావించినట్లయితే పెద్దల దృష్టికి తీసుకువెళ్లండి. వారు ఖచ్చితంగా ఓ మార్గం చూపుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలబంద గుజ్జుతో చెమట పొక్కులకు చెక్