Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీవితం శృంగారభరితంగా మారాలంటే ఏం చేయాలి...?

చాలామంది తమకు టైం లేదు... బిజీ అంటుంటారు. కానీ అలా బిజీ బిజీ అంటూనే వృద్ధులయిపోతారు. వెనక్కి తిరిగి చూసుకుంటే విలువైన జీవితం కరిగిపోయిన మైనపు ముద్దలా కనబడుతుంది. మళ్లీ తిరిగి రాదు కదా. అందుకే కొత్తగా వివాహమైన తర్వాత దంపతులు జీవితాన్ని సంతోషంగా, శృంగా

Advertiesment
life style
, శనివారం, 30 ఏప్రియల్ 2016 (13:28 IST)
చాలామంది తమకు టైం లేదు... బిజీ అంటుంటారు. కానీ అలా బిజీ బిజీ అంటూనే వృద్ధులయిపోతారు. వెనక్కి తిరిగి చూసుకుంటే విలువైన జీవితం కరిగిపోయిన మైనపు ముద్దలా కనబడుతుంది. మళ్లీ తిరిగి రాదు కదా. అందుకే కొత్తగా వివాహమైన తర్వాత దంపతులు జీవితాన్ని సంతోషంగా, శృంగారమయంగా గడిపేందుకు ప్లాన్ చేసుకోవాలి. కొన్ని చిట్కాలు...
 
* ఎన్ని పనులున్నప్పటికీ రోజుకు కనీసం ఆరు గంటల పాటు నిద్రపోవాలి. 
 
* ప్రతి రోజూ ఓ గంట పాటు వ్యాయామం చేయాలి. వాకింగ్‌, స్విమ్మింగ్‌, షటిల్‌ వంటి వ్యాయామాలు మంచివి. మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయాలి. ధ్యానం కూడా మీ లైంగిక శక్తిని పెంచుతుంది. 
 
* మారిన జీవన శైలికి అనువుగా వైద్య నిపుణులు దానిమ్మపండ్లు, ఆక్రూట్‌, ఓట్స్‌ శక్తినిస్తాయని చెబుతున్నారు. అలాగే మసాలాలు, ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుంది. చాక్లెట్లు తినడం వల్ల కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇటీవల పరిశోధనలో తేలింది. 
 
* సన్నిహిత మిత్రులతో ఉల్లాసంగా గడపాలి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవడంతో ఒంటరితనం పెరుగుతోంది. అందుకే వారానికి ఓ సారైనా పార్కులకు, రెస్టారెంట్‌లకు వెళ్లి మిత్రులతో కలిసి మెలిసి ఉల్లాసంగా ఉండేలా చూసుకోవాలి. 
 
* భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలకు తావు లేకుండా చూసుకోవాలి. అనుమానాల వల్ల మానసిక ఆందోళనకు గురై లైంగిక ఆసక్తి తగ్గుతుంది. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల జీవితం సుఖమయమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సున్నిపిండితో నిమ్మరసం కలిపి స్నానం చేస్తే మృతకణాలు మాయం!