Publish Date: Thu, 17 Jul 2014 (15:25 IST)
Updated Date: Thu, 17 Jul 2014 (15:27 IST)
మీ భార్య మూడీగా ఉందా? దీనికి కారణం ఏంటో ఆరాతీయండి. అంతేకాదు.. ఇంటి పనులతో శ్రమ ఎక్కువా లేకుండా ఇతరత్రా సమస్యలతో ఆమె మూడీగా ఉంటుందా అనేది తెలుసుకోండి. ఎప్పుడూ కోపంతో ఊగిపోతుంటే.. ఇక లాభం లేదు.. ఓ ముద్దు పెట్టేయండి. మూడీగా ఉంటే ఆమెను ముద్దు పెట్టుకోవడం ద్వారా ఆమె పట్ల మీకున్న ప్రేమను వ్యక్తపరచండి.
ఇంకా చాలామంది మహిళలు పురుషులు వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరని భావిస్తున్నారు. ఇలా మీ భాగస్వామి అనుకుంటే మీరలా కాదని నిరూపించండి. ఆమె సమస్యలేంటో అడిగి తెలుసుకోండి. ఇంటి పనిలో కాసింతనైనా సాయం చేయండి. అప్పడప్పుడు తను చేసేపనికి థ్యాంక్స్ చెప్పండి.
ఇంకా మీరు ఆమెను గుర్తిస్తున్న విషయాన్ని తెలియజేయండి. ఇంటి, ఉద్యోగ బాధ్యతలను తానొక్కటే మోస్తున్నాననే భావన కలిగించకండి. పని ఒత్తిడిని దూరం చేసుకునేందుకు కాస్త సాయపడండి. ఇవన్నీ చేస్తే తప్పకుండా మూడీగా ఉండే మీ భాగస్వామి చలాకీగా తయారవుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు.