నా వయస్సు 26 సంవత్సరాలు. ముంబైలో పని చేస్తున్నారు. నాకో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె ఇంటికి తరచూ వెళ్తుంటాను. అయితే, నా గర్ల్ ఫ్రెండ్ తల్లిదండ్రులు తమతమ సుఖాలను చూసుకుంటూ పిల్లల గురించి పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా.. నా గర్ల్ ఫ్రెండ్ తల్లి నా వయస్సున్న యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తన కోర్కెలను తీర్చుకుంటుంది. అలాగే, ఆమె భర్త కూడా ఆఫీసు పనుల మీద బయట తిరుగుతూ తన సుఖం తాను చూసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న నా ఫ్రెండ్ నన్ను రక్షించమని కోరింది. తల్లి వైఖరితో బెంబేలెత్తిపోయిన ఆమె చదువులపై దృష్టిసారించలేక పోతోంది. నేను ఏ విధంగా సాయపడగలను. సలహా ఇవ్వండి?
మీ గర్ల్ ఫ్రెండ్ మిగతా విషయాల గురించి ఆలోచన చేయడం మానేసి చదువుపై దృష్టిసారించమని చెప్పండి. తల్లిదండ్రులు సక్రమంగా లేని గృహాల్లో పిల్లల పరిస్థితి ఇలానే ఉంటుంది. వారి ప్రైవేట్ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం. తల్లిదండ్రుల గురించి ఆలోచన చేస్తూ సమయం వృధా చేసుకోవడం కంటే.. తన పని తాను చేసుకుని వెళ్ళమని చెప్పండి. అలాగే, తన సొంతకాళ్ళపై నిలబడేందుకు ప్రయత్నం చేయమని చెప్పండి. ఆమె తల్లిదండ్రుల ప్రైవేట్ జీవితాలు మీ గర్ల్ ఫ్రెండ్ జీవితానికి లేదా చదువులకు ఎలాంటి ఆటంకం కలగదనే విషయాన్ని గ్రహించండి. అప్పటికీ వారితో కలిసి జీవించలేకుంటే ఎక్కడైనా హాస్టల్‌లో చేరి చదువును కొనసాగించమని చెప్పండి. చెడు మార్గంలో పయనించే వారిని సక్రమ మార్గంలో పెట్టాలని ప్రయత్నించడం కంటే.. వారికి అడుగు దూరంగా మనమే ఉండటం ఉత్తమం. వీలైతే మీకు చేతనైతే ఆమెకు సాయం చేసి.. భవిష్యత్‌లో తన కాళ్ళపై తాను నిలబడేలా సాయం చేయండి. ఆ తర్వాత మీకిద్దరికి ఇష్టమైతే వివాహం చేసుకుని చేసుకుని వారితో సంబంధం లేకుండా జీవించండి.