Publish Date: Mon, 28 Dec 2015 (17:34 IST)
Updated Date: Mon, 28 Dec 2015 (17:36 IST)
రాత్రి పడుకున్న తర్వాత గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు వస్తుంటాయి. ఈ కలలు అన్ని రాత్రుళ్లూ రావు. ఎప్పుడో ఓసారి అలా వచ్చి వెళుతుంటాయి. కొన్ని కలలు సంతోషాన్ని ఇస్తే మరికొన్ని కలలు వచ్చినప్పుడు నాలుక పిడచకట్టుకుపోయి.. అసలు మనం బ్రతికే ఉన్నామా అన్నంత భయం కలుగుతుంది. ఇలాంటి భయంకర కలలు వచ్చినప్పుడు ఏదో జరుగబోతుందా అనే ఆందోళన కూడా కలుగుతుంది. ఐతే కలలు వాస్తవ రూపం దాల్చవని అంటారు కానీ ఈ కలలు కొన్ని సంకేతాలను సూచిస్తుంటాయని చెపుతున్నారు పరిశోధకులు.
అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. కలలో మనల్ని ఎవరో తరుముతున్నట్లు కన్పిస్తుంది. లైఫ్‌లో ఏదో సమస్య మిమ్మల్ని వెంటాడుతోంది. దాన్నుంచి తప్పించుకుపోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పరుగెత్తాలని ప్రయత్నిస్తున్నా మీ కాళ్లు మొరాయిస్తున్నాయి. మీరు ఉన్నచోటనే ఉండిపోతున్నట్లు కల వస్తే మీలో ఆత్మవిశ్వాసం కొరవడిందని అర్థం. కాబట్టి మీ జీవన నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. మీలో ఉన్న శక్తి ఏమిటో గ్రహించి మీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలి.