Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హరిః ఓం నమస్తే..!

Advertiesment
ఆధ్యాత్మికం ప్రార్థన హరిః ఓం నమస్తే ఈశ్వరాధన కార్తీకమాసం రుద్రాభిషేకాలు రుద్రపూజ
ఈశ్వరాధనకు కార్తీకమాసం చాలాముఖ్యమైందని ఆర్యులు అంటున్నారు. దేశంలోని పలు శివాలయాల్లో కార్తీకమాసం ప్రారంభం నుంచే రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు వంటి కార్యక్రమాలను విశేషంగా జరుపుతుంటారు.

అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నమై కొంగుబంగారంలా సకల సంపదలను, సుఖజీవితాన్ని ప్రసాదిస్తాడు.

"హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ రాయ మహాదేవాయ త్ర్యంబకాయ
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ నమః"

అంటూ.. ఆలయాలు కార్తీక మాసాన మార్మోగుతుంటాయి. గృహాల్లో "ఆదిత్యమంబికా విష్ణు గణనాధం మహేశ్వరం" అని పంచాయతన దేవతలను దీపారాధన సమయాల్లో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని ఆర్యుల విశ్వాసం.

Share this Story:

Follow Webdunia telugu