అర్థనారీశ్వరుడైన శివపరమాత్మ స్వరూపమే దుర్గాదేవి అని శాస్త్రోక్తం. మహిళలు తమ సౌభాగ్యం కోసం దుర్గాదేవి నిత్యం పూజిస్తుంటారు. దుర్గామాతను పూజిస్తే ముక్కంటిని అర్చించినట్లవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
శ్లో.. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే.
కార్తీకమాసంలోని సోమ, మంగళ, శుక్రవారాల్లో మహిళలు నిష్ఠనియమాలతో దీపాలను వెలిగించి కర్పూర హారతులు సమర్పించే సమయంలో పై శ్లోకాన్ని పఠించినట్లైతే దీర్ఘసుమంగళి ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. శివుని శక్తి రూపమే దుర్గాదేవి కావడంతో ఆమెను స్తుతిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి.