బ్రహ్మదేవుని చైతన్య శక్తి సరస్వతీ మాత. సరస్వతీ దేవి విద్యా వివేకాలకు దివ్యత్వం. ఆమె వేద స్వరూపిణి. బ్రహ్మ దేవుని సృష్టికంతటికీ ఆమె విజ్ఞాన సర్వస్వం. ఈ సృష్టికంతటికీ ఆమే విజ్ఞాన సర్వస్వం. ఈ సృష్టి అంతటా ఆమే నిండి ఉన్నది. ఆ విషయం వేదాలు తెలియజేస్తున్నాయి.
సరస్వతీ దేవి తృతీయ శక్తి అని భాగవతంలో చెప్పబడింది. అటువంటి సకల విద్యా స్వరూపిణి అయిన సరస్వతిని ఎవరైతే ఉపాసిస్తారో వారికి సమస్త విజ్ఞానం లభిస్తుంది.
బ్రహ్మ స్వరూపా పరమా జ్యోతీరూపా సనాతనీ
సర్వ విద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమః
యయావినా జగత్సర్వం శశ్వజ్జీవస్మృతం సదా
జ్ఞానాధిదేవి యాతస్మై సరస్వత్యై నమో నమః
బ్రహ్మ స్వరూపిణి సరస్వతీ దేవి. ఆ జ్యోతి రూపిణి సనాతనురాలు. అన్ని విద్యలకూ అధి దేవత. ఆ తల్లి లేకుంటే ఈ చరాచర ప్రపంచమంతా నిస్తేజమవుతుంది. జ్ఞాన దేవత అయిన సరస్వతీ దేవికి నమస్కారం.