"శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్
ఆజానుబాహుమరమింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి"
శ్రీ విష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుని ధనుర్మాసంలో పూజిస్త సకల మోక్షమార్గములు ప్రాప్తిస్తాయని విశ్వాసం. ధనుర్మాసం ప్రతినిత్యం నిష్ఠ నియమాలతో ఏకపత్నీ వ్రతుడు రామచంద్రుని ప్రార్థిస్తే సకల సంపదలు చేరువవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ధనుర్మాసం పూర్తిగా ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటి ముంగిట అందాల ముగ్గులతో అలంకరించి, పూజగదిలో దీపాలు వెలిగించి పై శ్లోకమును పఠించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.