"శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీ కారాయ నమశ్శివాయ 2"
అనే ఈ శివ పంచాక్షరీ స్తోత్రాన్ని ప్రతినిత్యం స్తుతించే వారికి కైలాసవాసం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. ఈ నెల 23వ తేదీన వస్తోన్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా.. శివరాత్రికి మూడురోజుల నుంచి భోళాశంకురిడికి ఉపవాసముండి, మూడో రోజైన శివరాత్రి రోజున శంకరుడిని నిష్ఠతో పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
ఉపవాసముండే రోజే గాకుండా, ప్రతినిత్యం పై స్తోత్రాన్ని స్తుతిస్తే ఈతిబాధలు, దారిద్ర్యాలు, రోగాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. లింగమే ప్రతీకగా భక్తుల కోర్కెలను నెరవేర్చే ఈశ్వరుడిని పై స్తోత్రముతో స్తుతిస్తే కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయని పురోహితులు అంటున్నారు.
ఇకపోతే.. సాధారణంగా ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున "శివరాత్రి" వస్తూనే ఉంటుంది. దానిని "మాసశివరాత్రి" అంటారు. అందులోబహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రినే "మహాశివరాత్రి" అని పిలుస్తారు. ఈ శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో పరమాత్మను స్తుతించే వారికి సమస్త భోగభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం.