"శివాయ గౌరీ భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమశ్శివాయ" 2
అనే ఈ శివ పంచాక్షరీ స్తోత్రమును కార్తీకమాస ప్రతినిత్యం ఉచ్చరించినట్లైతే మోక్షము ప్రాప్తిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కార్తీక మాసంలో వచ్చే సోమ, శని వారాలు, ప్రదోష సమయాల్లో ఈ పంచాక్షరీ మంత్రాన్ని ఉచ్చరించి శివపరమాత్మను మనసారా స్మరించుకునే వారికి సకల సంపదలు చేరువవుతాయని విశ్వాసం.
అదే విధంగా కార్తీక శనివారాల్లో శివ, విష్ణువులు కలిసి ఉండే ఆలయాలను దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం చేసి, పూజగదిని శుభ్రం చేసి, పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. సాయంత్రమున ఇంటి ముంగిట దీపాలు వెలిగించి, దీపారాధన చేసి శివుడిని ప్రార్థిస్తే ఆ గృహంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం.