"తృతీయాయాం యజేద్దేవీం శంకరేణ సమన్వితామ్
కుంకుమా గరుకంచ్చర మణివస్త్ర సుగంధకైః
స్రగ్గంధదూపదీపైశ్చ దమనేన విశేషతః
ఆందోలయేత్తతో వత్స శివోమాతుష్టయే సదా"
అనే శ్లోకముతో ఉమామహేశ్వరులను, గంధపుష్పధూపదీపాలతో అర్చించిన వారికి సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. మీ పూజగదిలో చిన్న ఊయలను ఏర్పాటు చేసి అందులో దివ్యసుందరంగా అలంకరించబడిన ఉమామహేశ్వరుల విగ్రహాలను ఆసీనులు గావించి, పై శ్లోకముతో అర్చించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
అంతేగాకుండా.. మత్స్యజయంతి రోజున శ్రీహరిని ప్రార్థించుకుంటూ... పై శ్లోకమును పఠించిన వారికి వైకుంఠవాసం ప్రాప్తిస్తుందని విశ్వాసం. ఇదేవిధంగా ధనుర్మాసంలో ప్రతినిత్యం శుచిగా స్నానమాచరించి, భక్తిశ్రద్ధలతో శ్రీహరిని పై శ్లోకముతో అర్చించిన వారికి మోక్షమార్గము సిద్ధిస్తుందని నమ్మకం.