ఒకసారి పార్వతీ దేవి పరమశివునిని... "కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం" అని విష్ణు సహస్రనామ సోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు ఓ పార్వతీ దేవీ నేను.. నిరంతరం విష్ణు సహస్ర నామ ఫలితం కోసం...
"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్సుల్యం రామనామ వరాననే" 2
అని మూడుసార్లు స్మరిస్తానని శివపరమాత్మ దేవీతో చెప్పారు. ఈ స్తోత్రాన్ని మూడుసార్లు స్మరించినట్లైతే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాకుండా, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పార్వతీ దేవీతో శివుడు చెప్పినట్లు శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
అందుచేత కార్తీక మాసంలో ఈ స్తోత్రమును ప్రతిరోజు మూడు సార్లు చెబితే శివపరమాత్మను ధ్యానించినట్లవుతుందని విశ్వాసం. అంతేకాదు... ఈ స్తోత్రానికి మరో విశేషం కూడా ఉంది. కాశీలో భక్తులు జీవిస్తూ... ఆ పుణ్యక్షేత్రమందు మరణించిన వారి కుడిచెవిలో ఈ స్తోత్రాన్ని చెప్పి, సద్గతి కలిగిస్తారన్నది భక్తుల విశ్వాసం.