Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శనివారం.. శనీశ్వరుడిని స్తుతించండి

Advertiesment
ఆధ్యాత్మికం ప్రార్థన శనీశ్వరుడు మందేశ్వరుడు శనిగ్రహదోషాలు శనిత్రయోదశి మహన్యాస లఘున్యాస తైలాభిషేకం
నమస్తే కోణ సంస్తాయ 1 పింగళాయ నమోస్తుతే 2
నమస్చే బభ్రురూపాయ 1 కృష్ణాయచ నమోస్తుతే 2
నమస్తే రౌద్రదేహాయ 1 నమస్తే చాంతకాయ చ 1
నమస్తే యమసౌజ్ఞాయ 1 నమస్తే సౌరయే విభో 2
నమస్తే మందరూపాయ 1 శనైశ్చర నమోస్తుతే 1
ప్రసాదం మమదేవేశ 1 దీనస్య ప్రణతస్యచ 2

అని ప్రతి శనివారం శని భగవానుడిని ప్రార్థిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. శనిభగవానుడు స్తోత్రప్రియుడు, కరుణామయుడు కావున... శనీశ్వరుడిని భక్తి ప్రపత్తులతో పూజించిన వారికి గ్రహదోషాలు తొలగిపోతాయి.

అంతేగాకుండా.. "శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన శనివారం రోజున శనిత్రయోదశి రోజున ఏకాదశ రుద్రాభిషేకం, మహన్యాస, లఘున్యాస తైలాభిషేకం వంటి విశేష పూజలు చేయించే వారి గ్రహదోషాలు దరిచేరవని పురాణాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలోని అతిపురాతన పుణ్యదేవాలయమైన శ్రీ మందేశ్వర (శనీశ్వర) స్వామి దేవస్థానంలో "శనిత్రయోదశి" పర్వదినాన విశేష పూజలు చేయించేవారికి ఈతిబాధలు తొలగిపోయి... పునీతులౌతారని పండితులు పేర్కొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu