గృహంలో లింగార్చన చేయడం శుభప్రదం. అయితే స్ఫటిక, బాణలింగాలను అర్చించేందుకు చాలా నిష్టనియమాలు అవసరం. అలాగాకుండా... వెండి, బంగారంతో చేసిన లింగాలను ఇంట్లోని పూజగదిలో ఉంచి అర్చించుకోవచ్చు. మంత్రాలు రాకపోయినా... "శివాయనమః" అనే శివనామంతో అర్చిస్తే చాలు.
పంచాక్షరాలైన శివనామాన్ని పలుకుతూ... శివుని ధ్యానించి అభిషేకం చేసి, మారేడు దళాలతో, తులసి దళాలతో, జిల్లేడు, ఉమ్మెత్త, తుమ్మి వంటి పూలతో పూజిస్తే సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం. మనసారా పరమాత్మను దర్శించుకుంటే... ఆ మహాదేవుని అనుగ్రహం భక్తులకు తప్పకుండా లభిస్తుంది.
అదే విధంగా విబూది ధరించి, రుద్రాక్షలు ధరించి శివార్చన చేయాలి. (రుద్రాక్షాదుల్ని శుచిగా ఉన్నప్పుడే ధరించాలి.)
"మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనమ్ 1
వత్సం గౌరివ గౌరీశో ధావంత మనుధావతి" 2
"మహాదేవ- మహాదేవ-మహాదేవ" అని పలికే వారి వెంట పార్వతీ సహితుడైన శివుడు నిరంతరం తోడుంటాడని నమ్మకం. కార్తీకమాసంలోని ప్రతి రోజున శివలింగాన్ని పైవిధంగా అర్చించుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.