మ్రింగెడివాడు విభుండును
మ్రింగెడిదియు గరళమనియు, మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళ సూత్రమ్మునెంత మది నమ్మినదో!
సర్వపాప హరుడు, సృష్టి లయకారుడు తన భర్త అయినటువంటి పరమేశ్వరుడు లోకప్రళయాన్ని సృష్టిస్తున్నగరళాన్ని మింగమని ప్రోత్సహించింది జగన్మాత అయిన పార్వతీదేవి. ఆమెకు తన మాంగళ్యం పట్ల ఎంత నమ్మకమో కదా మరి... గరళాన్ని సేవించమని తన భర్తనే ప్రోత్సహించింది. లోకసంరక్షణార్ధం ఇలా ఎన్నో సార్లు తన భర్తనే గాక... తానే స్వయంగా లోకాన్ని ఉద్ధరించేందుకు నడుం బిగించింది ఈశ్వర జ్ఞానాన్ని పొందిన జ్ఞానాంబికాదేవి.
- భాగవతం