"చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్" 2
కార్తీక శుక్రవారం రోజు సాయంత్రమున పై శ్లోకమును ధ్యానించి శుచి శుభ్రంగా ఇంటి ముందు దీపాలు వెలిగించినట్లైతే ఆ గృహంలో శ్రీ మహాలక్ష్మి కటాక్షంతో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఏ ఇంటిముందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో! ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని విశ్వాసం. అందుచేత కార్తీకమాస ప్రారంభం నుంచి ప్రతి నిత్యము సంధ్యాసమయంలో ఇంటి ముందు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవిని మన గృహానికి ఆహ్వానించినట్లవుతుందని నమ్మకం.
అదే విధంగా... శుక్రవారం సాయంత్రమున లక్ష్మీస్వరూపమైన తులసి కోట ముందు తొలుత దీపాలు వెలిగించి, పై శ్లోకాన్ని పఠించి ఇంటి ముంగిట దివ్వెలను వెలిగించినట్లైతే సర్వసంపన్నులుగా జీవిస్తారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.