శ్రీ చక్రాంకిత విశ్వదివ్యనగరీ సింహాసనా ధ్యాసినీమ్ అంకేలాలిత రామకృష్ణ చరితాం బౌద్ధైర్జినైర్మంజితామ్! ఆచార్య ప్రవరైశ్చ నానక దయానందాదిభిర్నందితామ్ వందే భారతమాతరం, సురవరాం వాత్సల్య పూర్ణాంధరామ్!!
తాత్పర్యం : ఓ భరతమాతా నీకు నమస్కారం! దేవతలకు వరాలిచ్చి వారిచేత ఉత్తమ రాలివనిపించుకున్నావు. నీ వాత్సల్యంతో భూమిని నింపావు. శ్రీ చక్రం ప్రతిష్టించిన ఈ ప్రపంచంలోని దివ్యనగరమైన ఇంద్రప్రస్థంలోని సింహాసనంమీద నీవు ప్రతిష్టించబడ్డావు. నీ ఒడిలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూర్చొని ఉన్నారు. బుద్ధుడు, మహావీరుడు కూడా నీ ఒడిలో అందంగా కనిపిస్తున్నారు.
శ్రేష్ఠులైన త్రిమతాచార్యులు ఇంకా సిక్కుమత స్థాపకులు గురునానక్, మహర్షి దయానందుడు నిన్ను ప్రశంసిస్తున్నారు. అంతేకాదు.. నీ బిడ్డలైనందుకు మేమంతా ఆనందిస్తున్నాం. నిజంగా నీవు వాత్సల్యపూర్ణవు. నీకు నా వందనములు తల్లీ.