"భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ కరణే" 2
అంటూ ధనుర్మాసంలో ప్రతినిత్యం విష్ణువును ప్రార్థిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ధనుర్మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాల్లో సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, పూజగదిని పుష్పాలతో అలంకరించి పై శ్లోకమును పఠిస్తూ మహా విష్ణువును ప్రార్థిస్తే ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివెరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా మనశ్శాంతి, తలచిన కార్యాలు విజయవంతమవుతాయని విశ్వాసం.
ఇకపోతే.. ధనుర్మాసంలో విష్ణుపూజకు పుష్పాలకంటే.. తులసిదళాన్ని ఎక్కువగా ఉపయోగించడం మంచిది. శుచిగా స్నానమాచరించి, తులసి ఆకులను మాలగా కూర్చి శ్రీహరికి సమర్పించుకున్న వారికి మోక్షమార్గం సిద్ధిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.