"కార్తీకే ధాత్రి వృక్షాధః చిత్రన్నైస్తోష యేద్దరిం 1
బ్రాహ్మణానేభోజయుద్భక్త్యా స్వయం భుంజేత బంధుభిః" 2
కార్తీక మాసంలో ఉసిరిచెట్టు కింద శుచిగా వండిన వివిధ వంటకాల్ని కేశవారాధనతో నివేదించి బంధుమిత్ర సహితంగా ఆరగించాలి. కార్తీక మాసమంతటా ప్రతిరోజూ సాయంత్రం సమయంలో శివాలయాలకు వెళ్లి పరమాత్మను దర్శించుకుంటే సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా... శివ, విష్ణువాలయాల్లో దీపాలను వెలిగించి.. దీపారాధన చేయడం మంచిది.
దీపాన్ని వెలిగించే ముందు..
"దామోదరాయ నభసి తులాయాం దోలయాసహ, ప్రదీపంతే ప్రయచ్ఛామి నమోనంతాయ వేధసే" 2
అని నమస్కరించాలి. మాసమంతా ఈ శ్లోకాన్ని పఠిస్తూ దీపాలను వెలిగించే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం.