Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రణోదేవీ సరస్వతీ...

Advertiesment
ఆధ్యాత్మికం ప్రార్థన ప్రణోదేవీ సరస్వతి చదువుల తల్లి విద్యార్థులు బుద్ధి కుశలతలు వాక్కు
"ప్రణోదేవీ సరస్వతీ 1 వాజేభిర్వాజినీవతీ ధీనా మవిత్ర్యవతు 2"

అంటూ చదువుల తల్లి సరస్వతీ దేవీని స్మరించుకుంటే విద్యార్థులకు బుద్ధిశక్తులు లభిస్తాయని పండితులు అంటున్నారు. దేవతలలో నదులలో శ్రేష్ఠులారైన సరస్వతీ దేవీని ప్రతి నిత్యం పై మంత్రాన్ని స్మరించుకునే వారు బుద్ధికుశలతతో జీవిస్తారని విశ్వాసం. అంతేగాకుండా అన్నప్రదాయినిగా, ధనప్రదాయినిగా శారదాదేవిగా భక్తులకు అండగా నిలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

అందుచేత విద్యార్థులు పరీక్షా సమయంలోనే మాత్రం కాకుండా ప్రతినిత్యం, శుచిగా స్నానమాచరించాలి. తర్వాత పూజగదిలోని సరస్వతీ దేవీ పటమో, లేదా విగ్రహాన్ని నిష్ఠతో పూజించి పై మంత్రాన్ని ఉచ్చరించినట్లైతే వాక్చాతుర్యతతో పాటు బుద్ధికుశలతలు దరిచేరుతాయని పండితులు అంటున్నారు.

మనిషికి మంచి మాటే అలంకారమని, మాటతోనే సర్వజగత్తు నడుస్తోందని, ఆ వాక్కుకు దేవత స్వరూపిణి అయిన సరస్వతీ దేవిని స్మరిస్తే సకల సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu