"పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ !
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహియే సదా" !
అంటూ ప్రార్థిస్తూ... ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి, అరటి పళ్ళు మున్నగు వాటిని నైవేద్యం చేసి నాగదేవతను మనసారా ప్రార్థించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు.. ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజుగానీ ఆ దినమంతా ఉపవాసముండాలి.
ఉపవాసముండే వారు పై మంత్రాన్ని జపిస్తూ నాగదేవతను పూజించడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఇలా... స్త్రీలు ప్రార్థిస్తే సుఖసంతానం, పెళ్లికాని యువతలు ఆరాధిస్తే.. మంచి భర్త లభించి అష్టైశ్వర్యాలతో జీవిస్తారని విశ్వాసం.