పరమాత్ముడు జీవరాశులను సృష్టించడానికి ముందే పంచభూతాలను (ఆకాశం, భూమి, అగ్ని, వాయు, నీరు) సృష్టించాడు. ఒక్కో భూతాన్ని రెండు భాగాలుగా విడదీసి, వాటిలో రెండవ అర్థభాగాలను నాలుగేసి భాగాలు చేశాడు. ఆ నాలుగు భాగాలను మిగిలిన నాలుగు భూత భాగాలలో కలిపాడు. ఇలా అన్ని భూతాలను కలుపగా ఒక్కొక్క భూతంలో దాని భాగం సగం కాగా మిగిలిన సగ భాగంలో నాలుగు భూతాలు కలిసి ఉంటాయి. అంటే ప్రతి భూతంలోను ఎనిమిది భాగాలలో నాలుగు భాగాలు తన అంశ కలిగి మిగిలిన నాలుగు భాగాలు పంచభూతాలలోని ఇతర భూతాలు అయివుంటాయి.
అందుకే ప్రతి వస్తువులోను ఇతర వస్తువుల లక్షణాలు అంతో ఇంతో ఉన్నాయని పెద్దలు చెప్తారు. భూమిలో సగ భాగం భూమి అయితే మిగిలిన సగ భాగంలో నీరు, నిప్పు, గాలి. ఆకాశం అన్ని కలిసి ఉంటాయి. అలాగే మిగిలిన భూతాల్లో కూడా. ఎండమావిలో నీరున్నట్లు తోచడం, ఆకాశజలం వంటివి పంచీకరణకు ఉదాహరణ. అదేవిధంగా మానవ దేహం కూడా పంచభూతాత్మకమే. మనం వ్యక్తిగతంగా, సమస్టిగా చేసే కర్మలను బట్టి దైవమే పంచభూతాల ద్వారా ఆయా కర్మఫలాలను అందిస్తాడు. అందుచేతనే పంచభూతాత్మకమైన మానవుడు మంచి విషయాలకు పంచభూతాలను సాక్షులుగా తీసుకుంటాడు.
పరమాత్ముడు జీవరాశులను సృష్టించడానికి ముందే పంచభూతాలను (ఆకాశం, భూమి, అగ్ని, వాయు, నీరు) సృష్టించాడు. ఒక్కో భూతాన్ని రెండు భాగాలుగా విడదీసి, వాటిలో రెండవ అర్థభాగాలను నాలుగేసి భాగాలు చేశాడు. ఆ నాలుగు భాగాలను మిగిలిన నాలుగు భూత భాగాలలో కలిపాడు. ఇలా అన్ని భూతాలను కలుపగా ఒక్కొక్క భూతంలో దాని భాగం సగం కాగా మిగిలిన సగ భాగంలో నాలుగు భూతాలు కలిసి ఉంటాయి.
అంటే ప్రతి భూతంలోను ఎనిమిది భాగాలలో నాలుగు భాగాలు తన అంశ కలిగి మిగిలిన నాలుగు భాగాలు పంచభూతాలలోని ఇతర భూతాలు అయివుంటాయి. అందుకే ప్రతి వస్తువులోను ఇతర వస్తువుల లక్షణాలు అంతో ఇంతో ఉన్నాయని పెద్దలు చెప్తారు. భూమిలో సగ భాగం భూమి అయితే మిగిలిన సగ భాగంలో నీరు, నిప్పు, గాలి. ఆకాశం అన్ని కలిసి ఉంటాయి. అలాగే మిగిలిన భూతాల్లో కూడా. ఎండమావిలో నీరున్నట్లు తోచడం, ఆకాశజలం వంటివి పంచీకరణకు ఉదాహరణ.
అదేవిధంగా మానవ దేహం కూడా పంచభూతాత్మకమే. మనం వ్యక్తిగతంగా, సమస్టిగా చేసే కర్మలను బట్టి దైవమే పంచభూతాల ద్వారా ఆయా కర్మఫలాలను అందిస్తాడు. అందుచేతనే పంచభూతాత్మకమైన మానవుడు మంచి విషయాలకు పంచభూతాలను సాక్షులుగా తీసుకుంటాడు.