"నీటి కుండ"ను దానం చేయండి
, శనివారం, 17 జనవరి 2009 (11:42 IST)
"
యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం 1వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరమ్"
నారాయణునికి చందనలేపనం చేయడం వల్ల విష్ణుమందిర వాసం లభిస్తుందని విశ్వాసం. ఈ కారణం చేతనే వైశాఖ శుక్ల తృతీయనాడు సింహాచల క్షేత్రంలో చందనోత్సవం జరుగుతుంది. వైశాఖ మాసంలో వచ్చే తృతీయ తిథి రోజున మాత్రమే కాకుండా... ప్రతి మాసంలో వచ్చే తృతీయ నాడు పితృకర్మలు చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పిండితరహితముగా యాగాది శ్రాద్ధం చేయాలని, లేదా తిలతర్పణమైనా చేయాలని పండితులు అంటున్నారు.అంతేగాకుండా తృతీయనాడు నీటి కుండను దానం చేయడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఇదే రోజున పానకం, వడపప్పు, మామిడిపండ్లు వంటి పదార్థాలను విష్ణుమూర్తికి నైవేద్యం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు దరిచేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.