తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!
మనలో దాగి ఉన్న ఆత్మజ్యోతి ప్రకాశమే ప్రాణం. ఆ ప్రాణం మనలోని ప్రతి అణువులో ఉంది. ఆ శక్తినే మనం సరస్వతి అంటున్నాం. అప్పుడైనా, ఇప్పుడైనా జ్ఞనసంపదకే ప్రాధాన్యత. విద్య, జ్ఞానానికి ఎవరు ప్రాముఖ్యతనిస్తారో, వారికి అన్నీ సమకూరుతాయనడంలో సందేహం లేదు. సంపాదించాలన్నా, సంపాదించినదాన్ని సద్వినియోగం చేయాలన్నా కావలసినది బుద్ధిశక్తి.