"అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్
అణిమాదిభి రావృతాం వయూఖై రహమిత్యేవ విభావయే భవానీమ్"
అటువంటి మంగళస్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలిమంగళవారంతో మంగళ గౌరి వ్రతాన్ని విధి విధానంగా ప్రారంభించి, ఐదు సంవత్సరములు దీక్షగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలపై "శ్రీ మంగళ గౌరి" కటాక్షముతో వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సర్వసౌఖ్యములతో జీవిస్తారని విశ్వాసం.
ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో పాటించినట్లైతే సకల సంపదలు, దీర్ఘసుమంగళి ప్రాప్తం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళి... ఎల్లప్పుడు భక్తులకు అండగా నిలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
అంతేకాకుండా.. ఈ వ్రత విధానాన్ని శ్రీ కృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి వివరించి, ఆమెచే ఈ వ్రతాన్ని చేయించినట్లు శాస్త్రాలు పేర్కొంటున్నాయి.