తులసీ దళ లక్షేణ కార్తికే యోర్చయేద్దరిం 1
పత్రేపత్రే మునిశ్రేష్ఠ మౌక్తికం ఫలమశ్నుతే 2
తులసీదళాలతో శ్రీ విష్ణువును పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ప్రతి నిత్యం మహిళలు సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి.. నిష్ఠ పై మంత్రాన్ని స్తుతిస్తూ.. తులసీ కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని పండితులు అంటున్నారు.
మహిళలు గానీ, పురుషులు గానీ ప్రతి నిత్యం శ్రీ మహా విష్ణువును తులసీదళములతో స్తుతిస్తే.. ఆ గృహంలో ఎల్లప్పుడూ సిరిసంపదలు వెల్లి విరుస్తాయని విశ్వాసం.
ఇంకా కార్తీక, వైశాఖ మాసాల్లో ఇంటిముందు తులసీ కోటను ఏర్పాటు చేయడం, తులసీ మొక్కలను పెంచడం చాలా మంచిదని పండితులు అంటున్నారు.