పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః 1
అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మనిభేక్షణా 2
తత్ సంయోగా దహంకారః స చ సేనా పతిరుహః 2
అంటే... పరమపురుషుడు విష్ణువు, శివుడు, ఉమాదేవి, లక్ష్మీదేవిల సమన్వయ, సమైక్య తత్త్వమూర్తి కుమార స్వామి అని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత కార్తీక మాసమున సుబ్రహ్మణ్య స్వామిని "ఓం శరవణ భవ" అంటూ ప్రతి నిత్యం అర్చిస్తే సకలసంపదలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.
కార్తీక మాసమున ప్రతి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి... "శివాయ నమః" అంటూ పంచాక్షర నామావళితో పాటు కుమారస్వామిని స్తుతించడం ద్వారా మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. మనిషిలోని అహం, అంధకారం, అవిజ్ఞానాన్ని పారద్రోలి బుద్ధికుశలతను సుబ్రహ్మణ్యస్వామి ప్రసాదిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి.