కార్తీక మాసంలో దీపారాధనకు ప్రత్యేక విశిష్టత ఉంది. అదీ కార్తీక సోమవారంలో మహిళలు వ్రతముండి ఆ రోజు సాయంత్రమున గృహంలో దీపాలను వెలిగిస్తే చిరకాల సౌభాగ్యంతో వర్ధిల్లుతారని విశ్వాసం. పెళ్లికాని యువతులు సుగుణమైన భర్త లభించాలని కోరుకుంటూ కార్తీక సోమవారాల్లో సాయంత్రం పూటన దీపాలను వెలిగిస్తే... శీఘ్రమే మాంగల్యబలం చేకూరుతుంది.
ఏ ఇంటి ముందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో... ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని నమ్మకం. అందుచేత శివపరమాత్మకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే... అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కార్తీక మాస సోమవారాల్లో మాత్రమే కాకుండా... మాసమంతటా సంధ్యాకాలమందు లక్ష్మీస్వరూపమైన తులసి కోట ముందు తొలుత దీపాలు వెలిగించి...
"చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్" 2
అని ధ్యానించి... పూజగదిలోనూ... ఇంటి ముంగిట దీపాలను వెలిగిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా... సర్వ సంపన్నులవుతారని నమ్మకం.