శ్రీ దత్తాష్టకం
బ్రహ్మా శ్రీ శహర స్వరూపమచలం లింగం జగద్వ్యాపకం
సత్వజ్ఞాన మనస్తమక్షర మజం చాంతర్భహిర్వ్యాపకం|
స్వచ్ఛన్దం సుగుణాశ్రితం సదమలం సర్వేశ్వరం శాశ్వతం
వన్దేహం గురుపూర్ణ బోధమనిశం శ్రీ దత్త యోగీశ్వరమ్||1||
విశ్వస్యాయతనం విరాట్ తను భ్రుతం వేదాన్త సారంవిదు
శ్చన్ర్దాదిత్య కృశానునేత్ర మానఘం జ్యోతి:పరం జీవనమ్|
ఉత్పత్తిస్థితి నాశనం జగదిదం చైతన్య బీజాత్మకమ్ ||2||
శాస్త్రాకార మనేక కావ్య రచనా దీక్షోపమాంగీ కృతం
కాలాతీత మనాది సిద్ధ పరమం కర్పూర గౌరోపమం|
నిశ్శీమం నిగమాదితం నిధిపరం నేతీతి నిర్ధారితం||3||
భూతానామధి దైవతం నిజమహాతత్త్వం పురాణం పరం
మూలాస్థాన నివాసినం మునివరం మృత్యుంజయం ముక్తిదం|
సర్వోపాధి వివర్జితం చ విషయై: సర్వేన్ర్దియై: స్వాధితం||4||
ఆదివ్యాధిహరం వృణామతిశయం చారోగ్యమాయు:కరం
సౌభాగ్యం సకలేప్సితార్థ కరణం సంపత్కరం శోభనం|
కళ్యాణం కలి దు:ఖదోష శమనం కారుణ్య పుణ్యేశ్వరం||5||
ఆనన్దానన్దకర్తా త్రిభువన గురు: శుద్ధసత్త్వ ప్రధానమ్
అజ్ఞానాం జ్ఞానదాతా గణయతి శయనం శుద్ధసత్త్వ ప్రకాశమ్
సోహం సర్వాత్మత్త్వే జగదఖిలపదం పూర్ణబోధం పురాణం||6||
భక్తానామభయంకరం భవభయ క్లేశాపహారం శుభం,
నిర్విఘ్నం నిరుపద్రవం సునియతం నిత్యోత్సవం నిర్మలం
శత్రోస్తామసహారిణం లఘునతా తాపత్రయోన్మూలనం||7||
సోహం హంస: స్వగతవరపరం పూర్ణమానన్దసాక్షీ
వ్యోమాకారం విశాలం విభవప్రభవ భూతమాద్యన్తసాక్షీ
జ్ఞానం జ్ఞానార్ధసారం అహమిహ నియతం అద్వితీయం||8||
అని దత్తాత్రేయుడిని స్మరించుకుంటే కోరిన కోర్కెలను తీరుస్తాడు. దత్తాత్రేయుడు భక్తవత్సలుడు. భక్తులపై అంతులేని కారుణ్యాన్ని కురిపిస్తాడు. దత్తాత్రేయుని ఆరాధించేందుకు ఆర్భాటాలూ, ఆడంబరాలు అక్కర్లేదు. నిండు మనస్సుతో, నిష్కల్మషమైన హృదయంతో ప్రార్థిస్తే చాలు, ప్రత్యక్షమై వరాలు కురిపిస్తాడు. అందుకే దత్తాత్రేయుని ‘స్మృతిగామి’ అంటారు.
దత్తాత్రేయుడు విశిష్టమైన ఆచార్యస్థానం ఆక్రమించాడు. ఈ విశిష్టమైన స్థానం ఇంత తేలిగ్గా లభించిందా అని ఆశ్చర్యపోనవసరం లేదు. సాక్షాత్తూ దేవదేవుడైన దత్తాత్రేయుడు 24 మంది గురువుల వద్ద విద్యను అభ్యసించాడు. కనుకనే దత్తాత్రేయుని పరమ గురువుగా కొలుస్తున్నాం.
దత్తాత్రేయుడు గురువులకే గురువు విజ్ఞాన ఖని. అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా గురువుల వద్ద వినయంగా విద్యను అభ్యసించిన సద్గుణ సంపన్నమూర్తి. సకల వేదస్వరూపుడు. జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి. మౌనముద్రతోనే శిష్యుల సందేహాలను నివృత్తి చేసి గురుస్థానం దక్కించుకున్న దత్తాత్రేయుడు విశ్వానికే గురువయ్యాడు.
అందుకే దత్తాత్రేయుని
''జన్మ సంసార బంధఘ్నం స్వరూపానందదాయకం
నిశ్రేయసప్రద వందే స్మర్త్రగామీ నమావతు''
అని ప్రార్ధించుకుంటాం. జన్మ సంసార బంధనాల్ని తేలిగ్గా తెంచగలిగిన మహానుభావుడు, జ్ఞాననందాన్ని పంచగలిగిన ప్రేమమూర్తి, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు.
మనసా స్మరించినంత మాత్రాన సాక్షాత్కరించే దయాసింధువు దత్తాత్రేయుడు. అందుకే దత్తాత్రేయుని స్మరించుకుంటే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.