Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్తీకమాసం : తులసిని పూజిస్తే ఫలితం ఏమిటి?

Advertiesment
Significance of Tulasi puja in karthika masa
, శనివారం, 25 అక్టోబరు 2014 (14:28 IST)
పవిత్రమైన కార్తీక మాసంలో తులసీ పూజ పుణ్యఫలాలను ఇస్తుంది. ఈ మాసంలో తులసిని పూజించడంతో పాటు తులసిదళాలతో శ్రీమహావిష్ణువును అర్చించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి. 
 
తులసిని పూజతో కలిగే ఫలితమే.. తులసిమాలను ధరించడం వలన అంతే ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది. లక్ష్మీనారాయణులు తులసిని ఆశ్రయించి ఉంటారు. అందువలన తులసిమాలను ధరించిన వారిని అనుగ్రహిస్తారని పండితులు అంటున్నారు. 
 
తులసిమాలను ధరించడం వలన మనసుకి ప్రశాంతత లభిస్తుంది. అనారోగ్యాలు తొలగిపోయి.. ఆయురారోగ్యాలు చేకూరుతాయని, కీర్తిప్రతిష్టలు పెరుగుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. దోషాలు తొలగిపోవడంతో పాటు తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu