నాగుల చవితిరోజున నాగదేవతలను పూజిస్తారు. నవంబర్ 17 శుక్రవారం ఉదయం 11:30 లోపు చవితి ఘడియాల్లోపు నాగేంద్రుని పూజ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం.
కుజదోషం, కాలసర్పదోషం ఉన్నవారు ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించాలి. నాగదేవతను ఆరాధిస్తే సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతుందట.
నాగేంద్రుడిని పూజిస్తే అటు శివుడికి, ఇటు విష్ణువుని పూజించిన ఫలితం లభిస్తుంది. నాగదేవతకు పూజిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజున పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. సూది, కొడవలి వంటివి ముట్టుకోకూడదు. ఇనుము వస్తువులను కూడా వినియోగించకూడదు.
ఈరోజు నాగేంద్ర స్తోత్రం, సహస్త్రానామాలు పఠించాలి. అంతేకాదు ఈరోజు భూమిని కూడా దున్నకూడదు. శివకేశవుల పూజతో కూడిన నాగదేవత పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. చలిమిడి, పానం, పాలు పుట్ట వద్ద నాగమ్మకు నైవేద్యంగా సమర్పించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.