Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూర్యభగవానుడిని పూజిస్తే ఫలితమేమిటో..?

Advertiesment
సూర్యభగవానుడిని పూజిస్తే ఫలితమేమిటో..?
, శనివారం, 23 మార్చి 2019 (10:36 IST)
సూర్యభగవానుడిని పూజిస్తే ఫలితమేమిటో.. తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. సూర్య భగవానుడి వల్లే రాత్రింబవళ్లు, రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు ఏర్పడుతున్నాయి. ఆయన అనుగ్రహం వల్లనే సమస్త జీవులకు ఆహారం లభిస్తోంది. ఆరోగ్యం కలుగుతోంది. అలాంటి మహిమాన్వితమైన సూర్య భగవానుడిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. 
 
దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు, రుషులు ఇలా అంతా ఆ ప్రత్యక్ష నారాయణుడిని ఆరాధిస్తూ వచ్చారు. సూర్యభగవానుడిని పూజించి కోరిన వరాలను పొందినవాళ్లు ఎంతోమంది వున్నారు. వనవాస కాలంలో పాండవులు సూర్యభగవానుడిని ఆరాధించి ఆయన నుంచి 'అక్షయపాత్ర' ను పొందారు. 
 
వనవాస కాలంలో వాళ్లని ఆకలిదప్పులు నుంచి ఈ అక్షయపాత్ర ఎంతగానో కాపాడుతూ వచ్చింది. అలాగే సత్రాజిత్తు సూర్యభగవానుడిని ప్రార్ధించి, ఆయన నుంచి 'శమంతకమణి'ని వరంగా పొందాడు. ఇక రావణాసురుడితో యుద్ధానికి బయలుదేరడానికి ముందు సూర్యభగవానుడిని పూజించిన శ్రీరాముడు విజయాన్ని సాధించాడు. ఆ శ్రీరాముడికి తన సహాయ సహకారాలను అందించిన హనుమంతుడు కూడా, సూర్యభగవానుడి నుంచి జ్ఞానసంపదను పొందాడు.
 
అలాంటి సూర్యభగవానుడికి అనునిత్యం మూడు వేళలలోను అర్ఘ్యం వదలి నమస్కరించడం వలన పాపాలు పటాపంచలై శుభాలు చేకూరుతాయి. సంక్రాంతి నుంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించే సూర్యభగవానుడిని ఆరాధించడం వలన అనంతమైన పుణ్యఫలాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-03-2019 దినఫలాలు - వృషభ రాశివారు అలా చేస్తే...