అదౌరామ తపోవనాది గమనం! హత్వామృగం కాంచనం!!
వైదేహీహరణం జటాయుమరణం! సుగ్రీవ సంభాషణం!!
వాలీ నిగ్రహణం సముద్రతరణం! లంకాపురీ దహనం!!
పశ్చాద్రావణ కుంభకర్ణ హననం! త్యేతద్ది రామాయణమ్!!
భావం:
తండ్రి మాటను జవదాటక అడవులకేగిన వాడా, జటాయు, సుగ్రీవుల మిత్రుడా రామా! వాలి సంహారమొనర్చిన పురాణ పురుషా, లంకను దహించిన నీలమేఘశ్యామా రామా! రావణుని అంతమొందించిన దశరథ నందనా! కుంభకర్ణునికి ముక్తిని ప్రసాదించిన రామా, పవిత్రమైన రామాయణ కారకుడైన కౌసల్యా తనయా నీకివే మా ప్రణామములు.