మాట్లాడటం ఒక కళ-దాన్ని పెంపొందించుకోవాలి!
, బుధవారం, 27 జూన్ 2012 (17:31 IST)
మీరు మాట్లాడటమే కాదు. ఎదుటివారు చెప్పేవి కూడా వినాలి. విసుగు కలిగించినా, మధ్యలో వారు చెప్పేదాన్ని ఆపండి అనవద్దు. ఎంతటి ఉద్రేక పూరిత విషయమైనా కంగారుగా చెప్పవద్దు. వీలైనంత ప్రశాంతంగా చెప్పండి. ఎదుటివారు మీకు తెలియని కొత్త విషయాలు చెబుతున్నారేమో గమనించండి. మీ కంఠస్వరం మొరటుగా వుంటే మృదువుగా మాట్లాడటానికి ప్రయత్నించి అలవాటు చేసుకోండి. మీకు యాసగా మాట్లాడటం ఊత పదాలు మాట్లాడటం అలవాటు వుంటే క్రమంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఎదుటివారు ఇష్టపడని అంశాలను మాట్లాడకూడదు. ఎదుటివారికి అర్థం కాని విషయాలను మాట్లాడవద్దు. మీరేం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా అర్థమయ్యేటట్లు వివరించండి. ఎదుటివారు బాధపడేటట్లుగా ప్రత్యక్షంగా అంశాన్ని ప్రస్తావించవద్దు. ముందుగా ఆలోచించకుండా అనవసరమైన వాదనకు దిగవద్దు. ఎవరి గురించైనా విమర్శించేటప్పుడు ఆ సంభాషణ నోట్లో నుంచి బయటకు రాకుండా కనీసం పది నిమిషాలు గడువిచ్చి మాట్లాడండి. ఇతరుల అభిరుచులను, వారి ప్రవర్తనను మరింత నిశింతంగా పరిశీలించండి. మీరు కొంత సేపు మాట్లాడిన తర్వాత ఎదుటివారు కూడా మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి. ఎదుటివారికి ఆసక్తి కలిగించే విషయాలపై ఎక్కువగా మాట్లాడండి.