ప్రస్తుతం మహిళలపట్ల అత్యాచారాలు, అరాచకాలు, యాసిడ్ దాడులు తదితరాలు విపరీతంగా జరుగుతున్నాయి. దీంతో కొన్ని సూచనలు పాటిస్తే మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.
పగలు కావచ్చు లేదా రాత్రి కావచ్చు. ఇంట్లో కావచ్చు లేదా బయట దారిలో కావచ్చు మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనాకూడా మీపై దొంగలు, దోపిడీదారులు దాడి చేస్తే మిమ్మల్ని కాపాడుకునే విధంగా
దేవాలయాలకు వెళ్ళేటప్పుడు, బజారులోకాని లేదా ఏదైనా వివాహమహోత్సవాల్లో మహిళలనుంచి చైన్లను దొంగలించే సంఘటనలు చాలానే వింటూఉంటాం. ఇలాంటి సమయంలో మీరు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
రాత్రి సమయాలలో నిర్జన ప్రదేశాలనుంచి మాత్రం ఒంటరిగా వెళ్ళకండి. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం మెండుగానే ఉండవచ్చు. విపత్కరపరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళడం అంత మంచిదికాదు. తప్పని పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళాల్సిన అవసరం ఏర్పడితే ఎవరినైనా వెంట తీసుకువెళ్ళండి.
మీరు బ్యాంక్‌కు వెళుతున్నట్లు పదిమందికి చెప్పి వెళ్ళాల్సిన అవసరంలేదు. బ్యాంక్‌లో అపరిచితులకు మీ డబ్బులు ఎంచేందుకు ఇవ్వకండి. మీ డబ్బులను ఎంచేందుకు లేదా డినామినేషన్ వేసేందుకు బ్యాంక్ సిబ్బంది మీకు సహాయపడతారు. వయసులో పెద్దవారైతే మీతోపాటు ఎవరినైనా తోడు తీసుకువెళ్ళండి.
ఎట్టిపరిస్థితుల్లోను అపరిచిత వ్యక్తినుంచి లిఫ్ట్ అడగకండి. ముఖ్యంగా నాలుగు చక్రాల బండిలో వెళ్ళకండి. మీవద్ద వాహనం లేకుంటే పబ్లిక్ వాహనాలను ఉపయోగించండి. ఉదాహరణకు సిటీబస్సులు, ఆటోలు, షేర్ ఆటోలు.
మీరు ఆటోల్లో లేదా షేర్ ఆటోల్లో వెళ్ళేటట్లయితే కాస్త జాగరూకతతో ఉండేందుకు ప్రయత్నించండి. అదే మిమ్మల్ని ఎవరైనా లిఫ్ట్ ఇవ్వమని అడిగితే చాలా జాగ్రత్తగా వ్యవహరించండని పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.