మగవారు వ్యాఖ్యానాలు చేసినప్పుడు కొందరు మహిళలు ఆ వ్యాఖ్యానాల్లో ద్వంద్వార్థాలు వెతుకుతుంటారు. ఇటువంటి ధోరణి మానసిక పరిపక్వత లేమివల్ల కలగేది. సరైన మెచ్యూరిటీ ఉన్నవారు తేలిగ్గా వేసుకునే జోకులు, సరదా సభాషణలను స్వీకరిస్తారు.
ప్రతిమాటనూ భూతద్దంలో పెట్టి చూసే ధోరణిని సునిశిత పరిశీలన అని సమర్థించలేం. నిజంగానే ద్వంద్వంగా మాట్లాడే వారిని మానసిక వికాసంకల మహిళలు ఎంతదూరంలో ఉంచాలో అంతదూరంలో ఉంచగలరు.
ఎదుటి వ్యక్తి గుణగణాలను అంచనా వేయడంలో నిశిత పరిశీలన అవసరంగాని, ప్రతివారి మాటల్లోనూ తప్పులు పట్టేందుకు కాదు. ఇది ప్రతికూల దృక్పథానికి నిదర్శనమని చెప్పుకోవాలి. మనం ఎదుటివారి మాటల వెనుక నిగూఢ అర్థాలు వెతుకుతుంటే వారు అదేమాదిరి వెతగ్గలరని అర్థం చేసుకోవాలి.