భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే డబ్బు
డబ్బే విలన్‌గా కొన్ని దాంపత్యాలను అతలాకుతలం చేస్తూంటుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్న మార్క్స్ ఉవాచకి తగినట్లుగానే కొందరు భార్యాభర్తల మధ్య బంధం కూడా కేవలం ఆర్థికమైనదిగానే పరిణమిస్తూంటుంది. ఆఖరికి పడకగదిలోనూ డబ్బును గురించే వారు వాదులాడుకుంటారు.ఎంత కూడబెట్టినా కూడా అభద్రతా భావం విడిచిపెట్టదు కొందరిని. అందువల్ల వారు సుఖపడలేరు. దాదాపు 70 శాతం మంది దంపతులు తమ ఆర్థిక స్థితిగతులను గురించి వారానికి ఒక్కసారైనా మాట్లాడుకుంటారని అంతర్జాతీయంగా జరిపిన ఒక అధ్యయనంలో తేలింది.ఆర్థిక విషయాలను గురించి చర్చించుకోవడంలో తప్పేమీలేదు. అయితే అవి భీకర యుద్ధాలు కానివ్వకూడదు. ఖర్చులకి సంబంధించి ఒక బడ్జెట్ తయారు చేసుకోవాలి. డబ్బు అనేది చాలా సున్నితమైన అంశం. కాబట్టి, నీళ్లు నమలకుండా మీ భాగస్వామితో నేరుగా ప్రస్తావించండి. అయితే అహానికి తావివ్వకుండి.