ఇటు కెరీర్‌లోనూ అటు ఇంటి పనులలోనూ పని భారంతో సతమతమవుతున్న మహిళలు తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నారనేది నిజం. ఇలా నిత్య జీవితంలో ఎదుర్కొనే ఎదుర్కొనే ఇబ్బందులు, పనిభారం వల్ల టెన్షన్ కలగటం, దాంతో నలుగురిలో మెలిగే తీరు మారిపోవడం.. ఇవి మరింత టెన్షన్‌కు దారితీయడం.ఏదేమైనా ఒత్తిడి మనందరి జీవితంలో భాగం. ఒత్తిడినుంచి బయటపడేందుకు ప్రయత్నపూర్వకంగా మార్గాలు వెతికితే తప్ప బయటపడలేం. ఒత్తిడిని భరించడానికి మనస్తత్వ నిపుణుల వద్దకు పోవడం ఒక పద్ధతయితే ఇంట్లో మనకు అందుబాటులో ఉన్న వాటి సాయం తీసుకోవడం మరో మార్గం. అదేంటో చూద్దామా..ఏ మనిషయినా శారీకరంగా ఉపశమనం పొందితే మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు. త్వరత్వరగా, వేగంగా, ఆదుర్దాగా మొదలు పెట్టి ఉద్రక్తంగానే పనులు ముగించే చోట ఒత్తిడి తను తోడున్నానని పిలవకున్నా వచ్చి మనలో దూరుతుంది. అందుకే వీలైనంత వరకు ప్రతిపనినీ కంగారు పడకుండా తాపీగా ముగించే అలవాటు చేసుకోవాలి. శ్వాస బలంగా తీసుకోవడం వల్ల మనసులో ఒత్తిడి మటుమాయమవుతుంది. పనిలో పనిగా యోగ ధ్యానం అలవాటు చేసుకుంటే ఏ రకమైన టెన్షనూ ఉండదు. మనసులో భక్తి భావం ఉండి దైవ ప్రార్థన చేస్తే కూడా ఒత్తిడి ఓ మేరకు తగ్గుతుందని నిపుణుల ఉవాచ. |
జీవితంలో నింపాదితనం పోయి వేగం అడుగు పెట్టిన తర్వాతే ఒత్తిడి కూడా ఉరుకులు పరుగులు పెడుతూ వచ్చేసింది. మనం దేన్ని కోల్పోయామో దాన్ని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించడమే ఒత్తిడిని జయించే మంచి మార్గమవుతుంది... |
|
|
మనసు ఆహ్లాదంగా ఉంటే అన్ని రకాల ఒత్తిళ్లు మాయమవుతాయి. మరి మీకు గతంలో బాగా నచ్చి మరిచిపోయిన, పనుల ఒత్తిడిలో వదిలివేసిన హాబీలను మళ్లీ ఆరంభించి చూడండి. నచ్చిన పుస్తకాలు చదవటం, కుట్లు, అల్లికలు, తోటపని, పెయింటింగ్, వంట, సంగీతం, ఈత వంటి పనులను మళ్లీ మొదలెట్టండి. ఒత్తిడి మటుమాయం మరి...
తిండి పద్ధతులకు సంబంధించి చూస్తే హడావుడిగా కాకుండా ఆహారాన్ని తాపీగా, మనసులో ఆస్వాదిస్తూ తినడం మొదలెట్టండి. తిన్నగా నిటారుగా నడవడం కూర్చోవడం వంటి అలవాట్లు కూడా మనలోని మూడీనెస్‌ను పోగొడతాయి మరి.