మహిళల్లో ఆత్మ విశ్వాసం పెరగాలంటే ముందుగా వాళ్ళను వారు విశ్వసించాలి, స్వతంత్రంగా ఆలోచించటం నేర్చుకోవాలి. నాకు ఎలాంటి తెలివితేటలూ లేవు, నేను జీవితంలో ఏమీ చేయలేను, సాధించలేను అనుకుంటూ న్యూనతాభావంలోకి పడిపోకుండా.... దేన్నైనా సాధించగలను అనే నమ్మకంతో ముందుకు పోవాలి. ఆ నమ్మకమే ఆత్మవిశ్వాసం.మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే అందుకు అనేక అంశాలు దోహదం చేయాలి. ముఖ్యంగా మీ ఆలోచనా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మీ గురించి మీరు బాగా తెలుసుకోవాలి. నేను మంచిదానను, కల్లాకపటం లేనిదానను, కష్టపడి పనిచేసేదానను అనే పాజిటివ్ కోణంతో ఉండాలే గానీ, నేను ఏమీ చేయలేను సాధించలేను అనే నెగటివ్ భావజాలంలో పడిపోకూడదు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి...! |
|
మీరు మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తారో... ప్రపంచం కూడా మిమ్మల్ని ఆ దృష్టితోనే చూస్తుందన్న విషయాన్ని మరువద్దు. మీ గురించి ఎల్లప్పుడూ మంచిగానే ఆలోచించండి. ఇతరులతో పోల్చి చూసుకోండి. అంతే కాదు మీరు తక్కువవారు అన్న న్యూనతాభావాన్ని మీలో రాకుండా చూసుకోండి... |
|
|
మీ ఇల్లు, మీ కుటుంబం, స్నేహితులు, మీ సక్రమ ఆలోచనలు, భగవంతునితో మీకున్న విశ్వాసం మొదలైన వాటిని మీ సంపదలుగా గుర్తించండి. మీ గౌరవాన్ని పెంచుకోండి. మీరు మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తారో... ప్రపంచం కూడా మిమ్మల్ని ఆ దృష్టితోనే చూస్తుందన్న విషయాన్ని మరువద్దు. మీ గురించి ఎల్లప్పుడూ మంచిగానే ఆలోచించండి. ఇతరులతో పోల్చి చూసుకోండి. అంతే కాదు మీరు తక్కువవారు అన్న న్యూనతాభావాన్ని మీలో రాకుండా చూసుకోండి.
"నేను చేయగలను" అనే ఆత్మవిశ్వాసం మీరు కలిగి ఉన్నట్లయితే అనేక అద్భుతాలను సాధించగలరు. సక్రమమైన ఆలోచనా విధానమే మీ మనసులలో స్వర్గాన్ని సృష్టిస్తుంది. పాజిటివ్ అనేది స్వర్గమని, నెగటివ్ అనేది నరకంతో సమానమనే విషయాన్ని గుర్తుంచుకుంటే, మీరు ఎలా ఉండాలో మీకే అర్థమవుతుంది.
ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు, ఎప్పుడూ ఒకే కోణం నుంచి కాకుండా.... అన్ని వైపుల నుండీ ఆలోచించండి. అదే మిమ్మల్ని అందరికంటే ప్రత్యేకంగా ఉంచుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీ ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా మీతో కలసి నడవదు, మీకు మీరుగానే మీ అవసరాలను, కలలను సాఫల్యం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, మీకంటే బాగా పనిచేసే వ్యక్తిని పొగడటంలో తప్పులేదు. అసూయ అనేదాన్ని అసలు మీ దరిదాపుల్లోకే రానీయకండి అది మీకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది, మానసిక శాంతిని దూరం చేస్తుంది.
మీ జీవితంలో మీకే సొంతమైన ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, ఆ దిశగా కష్టపడి పనిచేయండి. మీ భావాలను చక్కగా వ్యక్తం చేసే భాషను ఎంపిక చేసుకుని అందులో నైపుణ్యాన్ని సాధించండి. మరిన్ని కొత్తవిషయాలను నేర్చుకోవడం ద్వారా మీ భాషను అభివృద్ధి చేసుకోండి.
అలాగే, మంచి పుస్తకాలను చదవటం, విద్యా పరిధిని విస్తృతం చేసుకోవడం వల్ల ఎలాంటి విషయమైనా సరే తడబడకుండా మాట్లాడగల నేర్పరితనం, ఆత్మవిశ్వాసం మీలో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. నావారు, నా ఉద్యోగం, నా కుటుంబం అని కాకుండా మీ జీవితానికి కొత్త అర్థాన్ని, ఉద్దేశ్యాన్ని ఇచ్చేలా తయారవండి, పేదవారికి సాయం చేయడంలో మనసు లగ్నం చేయండి.
చిరునవ్వులను మించిన గొప్ప ఆత్మవిశ్వాసం మనిషికి ఎక్కడా లేదు. చిరునవ్వును మించి అందాన్ని పెంచే విలువైన నగ ఎలాంటిది లేదు. మంచిగా ఉండాలి, మంచి భావాలను కలిగి ఉండాలి. నిజాయితీగా మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. ఎలాంటి గర్వం మీ దరి చేరకుండా మీలో మీరే తొంగి చూసుకోండి.
సమయ నిర్వహణ విషయంలో జాగ్రత్తగా వ్యహరించడం అలవరచుకోవాలి. మీ అభిరుచులే మీకు శాంతిని, సమతౌల్యాన్ని ప్రసాదించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తాయి. దూసుకుపోయే గుణం ఉండాలి, దూసుకుపోవడమే కాకుండా ఏదేని విషయాన్ని ధీమాగా నొక్కిచెప్పే గుణాన్ని అలవరచుకోవాలి.
చివరగా... మిమ్మల్ని మీరు తెలుసుకోండి.... మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి.... మీ జీవితాన్ని ప్రేమించండి.... ఆత్మవిశ్వాసం దానంతటదే వస్తుంది.