Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిత్య జీవితం ఓ దివ్యకళ...!

నిత్య జీవితం ఓ దివ్యకళ...!
, శుక్రవారం, 19 సెప్టెంబరు 2008 (18:41 IST)
FileFILE
భూమిమీద పుట్టిన ప్రతి మానవునికీ కష్టసుఖాలనేవి సహజమే..! దీనికి మహిళలేం మినహాయింపు కాదు. పుట్టిన క్షణం మొదలు మరణించేదాకా మహిళ జీవితం అనేక సంక్షోభాలు, సందిగ్ధాలు, పోరాటాలు, ఆరాటాలతో నిండి ఉంటుంది. అయితే వీటన్నింటి నుండి బయటపడాలంటే... నిత్య జీవితాన్ని ఓ కళలాగా మార్చుకోవాలి.

మహిళ మొదటగా సమస్యలు, సందిగ్ధాలు, పోరాటాలు, ఆరాటాలు లేకుండా జీవించడం నేర్చుకోవాలి. సమస్యలవల్ల, పోరాటాల వల్ల ఆమె అమూల్యమైన సమయం, కాలం ఎంతో వృధా అయిపోతుంది కాబట్టి, అసలు పోరాటాలు ఎందుకు చేయాలి అన్న విషయంపై ఓ స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.

సందిగ్ధంలో, వివాదంలో జీవిస్తున్నవారు, ఏదో అయిపోవాలన్న ఆరాటంలో మ్రగ్గిపోతుంటారు. కాబట్టే వారు సక్రమంగా జీవించలేకపోతున్నారు. ఉన్న పరిస్థితి నుండి ఉండాలనుకునే పరిస్థితికి మార్పు తెచ్చుకునే ప్రయత్నంలో కొంత వ్యవధి ఏర్పడుతుంది. ఆ వ్యవధిలో మానసికంగా పోరాటం ఆవిర్భవిస్తుంది. ఈ ఆందోళన వల్లే జీవితాలు తారుమారు అయిపోతుంటాయి.

సునిశితమైన, క్రమపద్ధతిలో సంస్కారవంతమైన పరిష్కార మూలాలను కనుగొన్నప్పడు పోరాటాలు చేయాల్సిన అవసరం రాదు. అప్పుడు వారి నిత్య జీవితం ఓ దివ్యకళగా మారిపోక తప్పదు. నిత్య జీవితం కళామయం చేసుకోవాలంటే నిర్భయంగా జీవించాలి. భద్రత లేదనే మానసిక ఆందోళన ఉండకూడదు. మరణ భీతి, ఏదో అవలేకపోయామనే ఆరాటం, నష్టపడిపోతామనే భయం మనసులో రాకూడదు.

ఇందుకుగానూ ఒక చైతన్యవంతమైన మానసిక ఉద్యమం చాలా అవసరం. మనం చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటిగా ఉండకూడదు. జీవిత కళను విమర్శించుకోవాలనుకుంటే... మౌలికంగా అచంచలమైన, సుస్థిరమైన న్యాయబుద్ధిని కలిగి ఉండాలి. జీవితకళను తెలుసుకోవాలంటే, అన్నింటికంటే ముఖ్యంగా నిష్కపటత్వంతో కూడిన ప్రవర్తన చాలా ముఖ్యం. ఏదో విధంగా జీవించటం కాదు. సక్రమంగా శక్తి సామర్థ్యాలకు అంతరాయాలు సంభవించకుండా... వాస్తవికతలో జీవించాలే కానీ, మాయా ప్రపంచంలో మాత్రం కాదు.

Share this Story:

Follow Webdunia telugu