నవ్వినా ముఖం తిప్పుకునేవారిపట్ల అభిమానంగా ఉండాలంటే..
ప్రేమించడం అనేది వ్యక్తిత్వం. దానిని వీధి వీధంతా ప్రకటించాల్సిన అవసరం లేదు. మీరు అభిమానించడాన్ని ఎదుటివాళ్లు గుర్తించాలి అనుకుంటున్నారంటే, మీకు అనురాగ స్వరూపం సరిగా తెలియదన్నమాట. పూర్తిగా అర్థం కాలేదన్నమాట.ప్రేమ ఎదురు చూడదు. ప్రతిఫలం ఆశించదు. ఎదుటివాళ్లూ మీ మీద ప్రేమ కలిగి ఉండాలనే నిబంధన ఏమీ లేదు. వెయ్యిమందికి సేవ చేసినా, ఇంట్లో ఇద్దరికే వండిపెట్టినా అదే ప్రేమను మీరు గుర్తించాలి. ప్రేమించగలగడం తెలివైన విషయమని మీకు తెలిసింది. ఇంకేం కావాలి.కోపం తెప్పించే పని ఎదుటివాళ్లు చేస్తే నీ కంటే నేను గొప్ప మూఢుణ్ణి అని నిరూపించుకునే పని మీరు చేయాలా... లేదు. ముందు ఈ ప్రపంచంలో అందరూ ప్రేమించే మనసు కలిగి ఉండనీ, చివరగా నేను మారతాను అంటూ ముర్ఖపు పట్టుదలతో ఇంకా అలాగే ఉంటారా...? ఆలోచించండి. అప్పుడు బోధపడుతుంది అసలు విషయం.