Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినండి

Advertiesment
తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినండి
, మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (20:27 IST)
సమాజం సుఖశాంతుల కోసం వెంపర్లాడే కొద్దీ జీవితంలో సంక్లిష్టత పెరిగిపోతున్న నేపధ్యంలో ఇంట్లో కానీ, ఆఫీసులో కాని నేటి మహిళపై అనేక రకాల ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. రోజువారీ తలెత్తుతున్న ఈ ఒత్తిళ్లు మహిళల వ్యక్తిత్వాలపై తీవ్ర ప్రభావాలు వేస్తున్నాయి. మహళల వ్యక్తిత్వ వికాసానికి ఈ కొత్త తరహా సమస్యలు ఎదురవుతూండడంతో ఇంటా బయటా కుటుంబ సభ్యులతో, సహ ఉద్యోగులతో మెలిగేటప్పుడు మహిళ సమతూకం పాటించడం కష్టమైపోతోంది. మారుతున్న సంబంధాలు, జీవన విలువల నేపధ్యంలో తమ వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా మలుచుకోవాలని ఆశిస్తున్న మహిళలకు నేటి కాలానికి అనుగుణంగా
ఎలా మెలగాలో చూద్దాం.

మీ ఇంటి విషయాలు, మీ మనసుకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ ఎవరితోనూ చెప్పకండి.
మీ స్వంత విషయాలు తక్కువగా మాట్లాడి ఇతరుల విషయాలు ఎక్కువ వినండి.
జీవితంలో ఎప్పుడూ నిరాశావాదులుగా మారకండి.
జీవితంలో అపజయం ఎదురైనప్పుడు న్యూనతా భావానికి గురికాకండి. అపజయం నుండి గుణపాఠం నేర్చుకోండి.
ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు నిగ్రహం కోల్పోవద్దు.
ఎంత చిన్నపనైనా పూర్తి ఉత్సాహంతో చేయండి. దేని గొప్పదనం దానికుంటుంది.
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు స్వయంగా తీసుకోండి.
ఇతరులు మీతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నారో మీరూ అలాగే ఇతరులతో వ్యవహరించండి.

Share this Story:

Follow Webdunia telugu