Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎప్పడూ నవ్వుతూ ఉండండి...!

Advertiesment
ఎప్పడూ నవ్వుతూ ఉండండి...!
, శుక్రవారం, 17 అక్టోబరు 2008 (17:53 IST)
నవ్వు నాలుగు విధాల చేటు అనే పాత సామెత ఏ నేపధ్యంలో పుట్టిందో కానీ జీవితంలో నవ్వడం నవ్వించడం సాధ్యం కాకపోతే మానసిక సమస్యలు రావడం తథ్యమని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే పని ఒత్తిళ్లలో ఎంతగా నలుగుతున్నా సరదాగా గడపడం అనేది మానసికోల్లాసానికి చాలా మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

సరదా చేసుకోవడమనేది ఇంధనం లాంటిది. అందువల్లనే కళాకారులు, క్రీడాకారులు, మరింకెవరికైనాసరే, తాము చేసే పనిలో పరిపూర్ణమైన ఆనందాన్ని పొందేవాళ్ళు వారి వారి రంగాలలో బాగా రాణించే వారవుతారు. అయితే జీవితంలో ప్రతి క్షణం అద్భుతం జరగక పోవచ్చు

అయితే సరదాగా ఉండటం వల్ల, సమస్యలను పెద్దగా పట్టించుకోక పోవడం వల్ల జీవితం నల్లేరుమీద నడకలాగా కాగలదు. పనుల్ని సక్రమంగా చేసే విధానం ఎప్పుడూ ఉంటుందన్న భావనను తుడిచి పెట్టండి.

పరిపూర్ణతా సాధన అనేది ప్రతిదానినీ ఒక పోరాటంగా చేస్తుంది. కనుక ఏ పనినైనా చిత్తశుద్ధితో మీ శక్తివంచన లేకుండా చేయడానికైనా ప్రయత్నించండి.

ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఆలోచనలను బట్టే ఆచరణ ఉండగలదని అనేక అధ్యయనాల్లో తేలింది. కనుక ఒక్కసారి మీరు నవ్వటం మొదలు పెట్టారంటే, అది మిమ్మల్ని మానసికంగా ఉత్సాహపరచి, మిమ్మల్ని కార్యోన్ముఖులను చేస్తుంది.

గతంలో మీకు ఆనందాన్నిచ్చిన విషయాల జాబితాను తయారు చేసుకోండి. అవి అప్పుడు మీకు సరదా కలిగించినట్లైతే, మళ్లీ ఇప్పుడు కూడా ఖుషీ కాగలవు. కనుక ఆ పని చెయ్యండి. శారీరక శక్తితో పాటు, మానసిక శక్తినీ పెంపొందించుకోండి. రెండింటి సమన్వయంతో జీవిత విజేతలు కండి.

నిపుణుల అధ్యయనాల ప్రకారం దాదాపు 70 శాతం శక్తి మీ మానసిక స్థితిపైనే ఆధారపడి ఉంటుంది. అనేక సందర్భాల్లో మీకే తెలియనంతగా అనేక ఇబ్బందికర పరిస్థితులనుంచి మిమ్మల్ని కాపాడింది మీ మానసిక శక్తే అని గ్రహించండి.

Share this Story:

Follow Webdunia telugu