Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంత ఎదిగినా ఒదిగి వినయంగా ఉంటే విజేతలు మీరే.!

Advertiesment
ఎంత ఎదిగినా ఒదిగి వినయంగా ఉంటే విజేతలు మీరే.!
, సోమవారం, 28 నవంబరు 2011 (11:34 IST)
FILE
ఉద్యోగంలో విజేతగా నిలిచేందుకు...లక్ష్యసాధనతో చిత్తశుద్ధి తప్పనిసరి. ఒక్కోసారి ఆ ప్రయత్నాలే బలహీనంగా ఉంటే నిరాశ మిగులుతుంది. ఇందుకు కారణాలనేకం. అయినా మనం వంతు ప్రయత్నం మనం చేయాలి.

ఒకరి మెప్పు కోసం కాకుండా సంస్థ మేలుకోసం నిజాయితీగా పని చేయాలి. ఇలా నైతిక విలువకు కట్టుబడి శ్రమిస్తే మీకు నిరాశ ఉండదు. అధికారిక సమావేశాలు.. ప్రాజెక్ట్ వర్క్స్ తదితర కీలక విషయాల్లో మీకు తెలిసిన సలహాలు మీ సహద్యోగులతో పంచుకుని వారి సలహాలూ తీసుకోవచ్చు. టీమ్ వర్క్‌కు తొలిమెట్టు భేషజాలులేని కలివిడితనమే.

నాకు నీవే సాటి... సరిరారు నాకెవ్వరు అనుకుంటే ఒక్క అడుగు ముందుకు వేయలేరు. పోటీతత్వాన్ని తట్టుకోవడానికి నిరంతర విద్యార్ధిగా ఉండటం తప్పనిసరి. ఈ ప్రతిభే మిమ్మల్ని విజేతగా నిలుపుతుంది. ఒకేసారి ఉన్నత స్థాయి చేరుకోవడం కోసం... ఇతరులను దిగజార్చే ప్రయత్నాలు వద్దు. అవి చివరకు మీకే ప్రమాదంగా పరిణమిస్తాయి.

మనకు తెలియని విషయాలలో ఇతరుల సలహాలు తీసుకోవడానికి వెనుకంజ వేయనవసరం లేదు సహద్యోగులతో కలసి ఉండటం, వారు విజయం సాదించినపుడు ప్రోత్సహించటం అసలైన నాయకత్వ లక్షణం. ఎంత ఎదిగినా ఒదిగి వినయంగా ఉండాలి. అందరితో సహృదయంతో ఉండటం వల్ల ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారిగా గుర్తింపు పొందుతారు.

Share this Story:

Follow Webdunia telugu